Jump in to reply — no account needed.
మా ఊరి బస్ స్టాండ్ పక్కన ఇరవై ఏళ్ళ నుంచీ ఒక చాయ్ వాలా ఉండేవాడు, అతని పేరు రమజాన్ భాయ్. వాడు ఇచ్చే కారం మిర్చీ బజ్జీలతో పాటు పప్పు-ఉప్మా కూడా నాకు బాగా గుర్తు. ఆ ఉప్మా వేసేటప్పుడు పచ్చి శెనగపప్పు వేసి, నూనెలో తాలింపు పెట్టి, చివర్లో నిమ్మకాయ పిండేవాడు— అది సరిగ్గా ఎంత ఖర్చవుతుందో లెక్క వేస్తే, పొద్దున్న కేవలం పది రూపాయల్లో ఒక పూర్తి పోషకాహారం దొరికేది. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ మారింది, కొత్త కేఫ్ వచ్చింద
#food#regional